వైఎస్ పరువు తీస్తావా?..పూనమ్ ట్వీట్ వైరల్!

0

కొంతకాలం క్రితం పవన్ ఫ్యాన్స్-కత్తి మహేష్ వివాదం నేపథ్యంలో తన వరుస ట్వీట్లతో పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ లోని ఓ ప్రముఖ దర్శకుడిపై పరోక్షంగా పూనమ్ గుప్పించిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. కొద్ది రోజులుగా ట్విట్టర్ లో పెద్దగా యాక్టివ్ గా లేని పూనమ్…తాజాగా మరో ట్వీట్ తో తెరపైకి వచ్చింది. ఏపీ – తెలంగాణలలో ప్రస్తుత రాజకీయాలపై పూనమ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు స్పందించిన ఓ నెటిజన్….పూనమ్ పై కామెంట్స్ చేశాడు. దీంతో అతడికి పూనమ్ ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి పెద్ద మనిషి పరువు తీయకంటూ అతడికి క్లాస్ పీకింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్వీట్స్ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ఏపీ – తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పూనమ్ ఓ ట్వీట్ చేసింది. ఆంధ్రా.. తెలంగాణ అంటూ మనలో మనమే కొట్టుకుని వేరేవారికి లబ్ధి చేకూరుస్తున్నామని పూనమ్ ట్వీట్ చేసింది. పిల్లి-పిల్లి తగువును కోతి తీర్చిన కథ గుర్తుకు వస్తోందంటూ ఓ కార్టూన్ ఫొటోను పెట్టింది. పూనమ్ ట్వీట్ కు ఆనంద్ రెడ్డి కోలా అనే నెటిజన్ వెటకారంగా స్పందించాడు. “ఓటుకు నోటు వల్ల లాభం ఎవరికి?…పూర్తి రాజకీయ అపరిపక్వతతో చేసిన రాజకీయ ట్వీట్ ఇది. మీరు ఏం మాట్లాడినా మీవల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు“ అని ట్వీట్ చేశాడు. ఆ నెటిజన్ దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆనంద్ కు పూనమ్ క్లాస్ పీకింది. ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న ఆ పెద్దమనిషి విలువ తీయవద్దని – సోషల్ మీడియాలో ఈ తరహా భాష వాడడం గొప్ప కాదని రిటార్ట్ ఇచ్చింది. అతడి వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయ్ అని ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది.
Please Read Disclaimer