కికి ఛాలెంజ్ ఎప్పుడో చేసేసిన భామ

0కొన్నేళ్ళ క్రితం తెలుగు సినీ ప్రేమికులను ఎవరినైనా మీరు ‘ఛాలెంజ్’ అంటే ఏంటి అని అడిగితే అది చిరంజీవి సూపర్ హిట్ సినిమాపేరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. ఫిట్నెస్ ఛాలెంజ్ – స్వచ్చ భారత్ ఛాలెంజ్ – హగ్ ఎ ట్రీ ఛాలెంజ్ – ప్లాంట్ ఎ ట్రీ ఛాలెంజ్… లాంటి చాలెంజ్ లు చాలా పాపులర్ అయ్యాయి. రీసెంట్ గా ఈ లిస్టు లోకి ‘కికి ఛాలెంజ్’ వచ్చి చేరింది. అక్కడెక్కడో హాలీవుడ్ నుండి ఇక్కడ టాలీవుడ్ వరకూ పాకింది.

ఇప్పటికే అందాల అదా శర్మ కికి ఛాలెంజ్ కి రెస్పాండ్ అయ్యి తన కథక్ డ్యాన్స్ ను కెనడియన్ ర్యాపర్ డ్రేక్ సాంగ్ ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డాన్స్ చేస్తూ ‘కికీ డు యు లవ్ మీ’ అంటూ రెచ్చిపోయింది. ఆ వీడియో వైరల్ అయ్యింది కూడా. ఇంట్రెస్టింగా మరో హాటు బాంబు పూనం పాండే కూడా ఈ కికి ఛాలెంజ్ ను స్వీకరించి డాన్స్ చేసింది. అదిప్పుడు కాదు. జూలై 14 వ తారీఖునే ఆమె ఆ కికి ఛాలెంజ్ కు చిట్టి పొట్టి జీన్సు నిక్కరేసుకొని మొదట ఈజిప్షియన్ భామ లాగ హిప్పు డాన్స్ చేసింది. ఆ తర్వాత ముందుకు అలా తిరిగి అందాల విందు చేసింది. కికీ డు యు లవ్ మీ అనే పాటకు ఇంతకంటే సెక్సీ డాన్స్ మరొకరు చేయలేనంతాగా చేసేసింది.

అంతా బాగుంది గానీ మనమెలా ఈ సుందరాంగి సెక్సీ నాట్యాన్ని మిస్సయ్యాం? ‘పప్పు’ – ‘పార్లమెంటు’ – ‘హగ్గు’.. విమర్శలు.. ప్రతి విమర్శలు అనే ప్రపంచం తలకిందులయ్యే గోలలో పడి ఇలాంటి సుందరి నాట్యాన్ని మిస్సయ్యామా ఏంటి? హతవిధీ మన పాపానికిక నిష్కృతి లేదు!

#kikidoyouloveme #crazyme lol 😜

A post shared by Poonam Pandey (@ipoonampandey) on