గుండు గీయించుకొన్న హీరోయిన్ పూర్ణ

0poorna-heroineబహుభాషా నటిగా పేరొందిన పూర్ణ కి తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ చేసినా కూడా ప్రస్తుతానికి ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్‌. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. నిజానికి ఆమె కెరీర్ లో మరీధారునమైన డిజాస్టర్లు లేవు, అలా అని బంపర్ హిట్లూ లేవు. అయితే ప్రతీ సినిమాలోనూ ఆమె తన మేరకు బాగానే చేసింది…

నటుడు శశికుమార్‌ తాజాగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం కొడివీరన్‌. కార్తీ కథానాయకుడిగా కొంబన్, విశాల్‌ హీరోగా మరుదు చిత్రాలను తెరకెక్కించిన ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కొడివీరన్‌. ఇదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది.

ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా హీరోలే మరీ తప్పని సరైతే తప్ప గుండుకు ఒప్పుకోరు. విగ్‌తో మ్యానేజ్‌ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది.

దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని చెప్పటం చూస్తూంటే ఇక హీరోయిన్ అవకాశాలు ఎటూ రావు కాబట్టి ఇలా నటనకు అవకాశం ఉండే పాత్రలతో ప్రేక్షకులని మెప్పిద్దామ అని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్‌ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్‌ సనూజ నటిస్తోంది.

దీనికి ముందు దర్శకుడు మిష్కిన్‌ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. అంతలోనే ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చిన ఈ అప్డేట్ జనాన్ని మరింత షాక్ కి గురి చేసింది.