మహేష్ అసెంబ్లీలో పోసాని రచ్చ రచ్చ

0



Posani-Krishna-Murali-in-Asటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. సినిమా సినిమాకి తన అంచనాలు పెంచుకుంటూ ఇతర ఇండస్ట్రీలోను నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్పైడర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదటి సారి తమిళ్ బాక్స్ ఆఫీస్ పై మహేష్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా సంగతి పక్కనపెడితే ప్రస్తుతం మహేష్ – భారత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఇక కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీమంతుడు తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు అలుముకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ సెట్ లో పోసాని ఎదో పరధ్యానంలో వెరైటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన పక్కన జీవా- బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు. పోసాని పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోందని తెలుస్తోంది.

మొదటి సారి తన గురువును బంధువును దర్శకుడు కొరటాల ఈ సినిమాలో చుపించాబోతున్నాడు. కొరటాల – పోసాని శిష్యుడే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశాడు. అలాగే పోసానికి దగ్గరి బంధువు కూడా.. ఇప్పటివరకు మూడు బాక్స్ ఆఫీస్ హిట్స్ తీసిన కొరటాల ఆ సినిమాల్లో పోసానికి ఏ పాత్ర ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.