హీరోగారి భార్య ఇరగదీసింది

0స్టార్‌ హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకి స్వస్తి చెప్పిన జ్యోతిక ఆమధ్య ఒక చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. తనకి నచ్చిన పాత్రలని చేస్తానని చెప్పిన జ్యోతిక మళ్లీ రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మగలిర్‌ మాట్టుమ్‌ అనే చిత్రంలో నటించింది. ఫిమేల్‌ సెంట్రిక్‌ థీమ్‌తో నడిచే ఈ చిత్రంలో స్త్రీలలో అభ్యుదయ భావాలు పెంచే గొప్ప కథాంశం వుందని కితాబులు వస్తున్నాయి.

ప్రధానంగా అన్నీ లేడీ క్యారెక్టర్లే కనిపించే ఈ చిత్రంలో జ్యోతిక ఒక రెబల్‌ మాదిరి పాత్ర చేసింది. జ్యోతిక లుక్‌, గెటప్‌తోనే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకున్న జ్యోతిక చాలా మంచి స్క్రిప్ట్‌ ఎంచుకుందని, నటిగా ఈ చిత్రం తనకి మరింత మంచి పేరు తెస్తుందని విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సర్వత్రా ప్రశంసలు అందుకుంటోన్న ఈ చిత్రం కమర్షియల్‌గాను సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి.

పెళ్లి తర్వాత నటనకి గుడ్‌బై చెప్పిన నటీమణులు ఎలాంటి కథలు ఎంచుకుంటే తమ గౌరవాన్ని కాపాడుకుంటూ నటిగా మరింత ముద్ర వేయవచ్చుననేది జ్యోతిక చూపిస్తోంది. జ్యోతికని చూసి ఇన్‌స్పయిర్‌ అయి ఇకపై రిటైర్‌ అయిన మరింత మంది హీరోయిన్లు మళ్లీ తెరమీదకి వస్తారేమో చూడాలి.Magalir-Mattum