పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్

0pspk-25పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అభిమానులకు పెద్ద పండగే. సినిమా ప్రారంభమైన నాటి నుంచి విడుదలయ్యే వరకూ దానికి సంబంధించిన ప్రతి విశేషాన్నీ తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది. పవన్‌తో పాటు కీర్తిసురేష్‌ తదితరులపై కీలక సన్నివేశాలను, పాటలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం బల్గేరియాలో పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌లతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటోంది.

ఇందులో పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన కారు ఫ్రంట్‌ సీటులో కూర్చుని లోపలి అద్దంలో చూస్తూ ఉన్న ఫొటో అది. ‘పవర్‌’ఫుల్‌ లుక్‌ అంటూ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. త్రివిక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘బయటకొచ్చి చూస్తే టైమేమో 3’0 క్లాక్‌’ పూర్తి లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధకృష్ణ నిర్మిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. సంక్రాంతి సందర్భంగా 2018 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.