పవర్ స్టార్ చేతులమీదుగా ‘2 కౌంట్రీస్ ‘ టీజర్

0సునీల్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘2 కంట్రీస్‌’ సినిమా టీజర్‎ని కొద్దిసేపటి క్రితం పవర్‎స్టార్ పవన్ కల్యాణ్ లాంచ్ చేశారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్ లోనే ఈ టీజర్ విడుదల చేసిన పవన్.. ‘2 కంట్రీస్‌’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‎గా ఉందని తెలిపారు.

గత కొంతకాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న సునీల్.. తన తాజా సినిమాకు పవన్ చేతులమీదుగా టీజర్ లాంచ్ చేయించి ఈ సినిమాపై కాస్త హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. పవన్ కూడా ఇలా సునీల్ సినిమా కోసం తోడవ్వటం ఇండస్ట్రీ వర్గాలలో ఆనందం నింపుతోంది.

ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ జంటగా మనీషా రాజ్‌ నటిస్తోంది. లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‎లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. త్వరలో షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్ నెలలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.