రాధా జోగేంద్రతో బాహుబలి

0prabas-promotion-on-rana-movieప్రభాస్, రానాలు మళ్లీ ఒక్క తెరపైకొచ్చారు. అయితే… సిల్వర్‌ స్క్రీన్‌ కాదిది, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌! రానా నటించిన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ఈ సినిమాలో రానా పోషించిన పాత్ర రాధా జోగేంద్రతో కలసి ప్రభాస్‌ ఫొటోలు దిగారు.

ఈ ఫొటోలను రానా స్వయంగా తీశారు. ఒక్క రానాతోనే కాదు… కాజల్‌ అగర్వాల్, ఈ సినిమాలో నటించిన ఇతరులతోనూ ఫొటోలు దిగొచ్చు. అయితే… అందుకు స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘యాప్‌స్టర్‌’ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.