ఆ ముద్దు వృథాయేనా?

0Prabhas-and-Anushka-Lip-Lock-in-Baahubali-2-Movie‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ బాహుబలి-2 సినిమాపై విపరీతమైన ఆసక్తి పెంచిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని సినిమా రిలీజ్ రోజునే థియేటర్ల ముందు క్యూ కట్టిన వారెందరో. కారణమేదైనా సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడు అందులో లీనమైపోయి చూసేలా చేయడంలో రాజమౌళి సూపర్ సక్సెస్ అయ్యాడు. బాహుబలి-1లో కొద్దిసేపే కనిపించిన అనుష్క సెకండ్ పార్ట్ ప్రారంభం నుంచే కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ప్రణయ సన్నివేశాలు మరీ రొమాంటిక్ గా కాకపోయినా ఆకట్టుకునేలా ఉంటాయి. స్టోరీ మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఈ సన్నివేశాలు ఉండటంతో సినిమాలో ప్రభాస్-అనుష్కల అధర చుంబనం ఎవరూ పట్టించుకోనే లేదు.

సాధారణంగా ఏదన్నా సినిమాలో చిన్న ముద్దు సీన్ ఉందంటే సహజంగానే ఆడియన్స్ లో ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. ఆ సీన్ వెనుక ఉన్న విశేషాలు వైరల్ అయిపోతాయి. ఆర్య-2లో అల్లు అర్జున్ – కాజల్ ల లిప్ లాక్ – తీన్ మార్ లో పవన్ – త్రిషల లిప్ లాక్ – బిజినెస్ మాన్ లో మహేష్ – కాజల్ ల ముద్దు సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతెందుకు బాహుబలి-1లో తమన్నా అందాల ఆరబోతను ఎవరూ మర్చిపోలేదు. దీనిపై విమర్శలు వచ్చినా మామూలు ప్రేక్షకులు మొత్తం తమన్నా గ్లామర్ ను బాగానే ఎంజాయ్ చేసి రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. సెకండ్ పార్ట్ ఆరంభం నుంచే రాజరికపు ఎత్తుగడలతో సాగడంతో గ్లామర్ కంటెంట్ ను జనాలు అసలు పట్టించుకోలేదు.

బాహుబలి-2 లో తమన్నాకు అస్సలు రోల్ లేకపోవడంతో సినిమా మొత్తం అనుష్కనే కనిపించడంతో ఆమెను అందంగా చూపించాలని రాజమౌళి గట్టిగానే ట్రై చేశాడు. హంసనావ పాట చూసిన వారెవరైనా ఈ విషయం ఒప్పుకుంటారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య చిత్రీకరించిన అంటీ అందని అధర చుంబనం ప్రేక్షకులకు అసలు రిజిస్టర్ అవలేదు.