ప్రభాస్ ను చూస్తే గర్వంగా ఉంది: హీరోయిన్‌

0Pranhas-and-kanganaబాహుబలిలో నటించిన హీరో ప్రభాస్‌కు అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ వచ్చి చేరింది. ప్రభాస్‌, కంగనాలు ఏక్‌నిరంజన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కంగనా ప్రభాస్‌ లేటెస్ట్‌ విక్టరీ బాహుబలి-2పై స్పందించారు.

ఏక్‌నిరంజన్‌ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవతో ఆయనతో మాట్లాడటం మానేశానని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రభాస్‌తో మాట్లాడిందే లేదని తెలిపారు. ఏక్‌నిరంజన్‌ తర్వాతి నుంచి ప్రభాస్‌ క్రమంగా ఎదిగారని అన్నారు. బాహుబలిలో ప్రభాస్‌ నటనకు ముగ్ధురాలినయ్యానని చెప్పారు.

అలాంటి యాక్టర్‌తో కలిసి నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. కంగనా తన తర్వాతి సినిమా రాణి ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న మణికర్ణికలో నటించనున్నారు.