ప్రభాస్ భీమ – సల్మాన్ ఆంజనేయ!

0ప్రభాస్ ని భీముడిగా – సల్మాన్ ఖాన్ ని ఆంజనేయుడిగా ఊహించుకోండి. సరిగ్గా అలానే ఊహించుకున్నాడో వీరాభిమాని. భారతీయ పురణేతిహాసాలైన రామాయణం మహాభారతం చిత్రాల్ని తెరకెక్కిస్తూ వీళ్లు ఈ పాత్రలకు పనికొస్తారు అనే అర్థంలో కొన్ని పెన్సిల్ స్కెచ్ లను రూపొందించాడు సదరు అభిమాని. ఈ స్కెచెస్ నెటిజనుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

భీముడు – ఆంజనేయుడు పాత్రధారులే కాదు – ఇతర పాత్రలపైనా సదరు అభిమాని స్కెచ్ లు వేశారు. రానా దగ్గుబాటి- బాలి – అమీర్ ఖాన్ – కృష్ణుడు – దీపిక పదుకొనే – ద్రౌపది – అమితాబ్ బచ్చన్ – దశరథ – రణవీర్ సింగ్- మేఘనాథ – రజనీకాంత్ -రావణాసురుడు – హృతిక్ రోషన్ – శ్రీరాముడు – రణబీర్ కపూర్ – లక్ష్మణుడు – కంగన రనౌత్ -సూర్పణక – సంజయ్ దత్ – కుంభకర్ణ – రాధిక ఆప్టే – సీత పాత్రలకు సూటవుతారంటూ స్కెచ్ లు రూపొందించారు.

ప్రస్తుతం ఈ స్చెచ్ లు నెటిజనుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ – సల్మాన్ – హృతిక్ – అమితాబ్ పాత్రలు ఓకే – ఇకపోతే రజనీకాంత్ ని రావణుడిని చేస్తే అభిమానులు ఊరుకుంటారా? అయినా ఆ పాత్రలో రజనీ అయితే ఇరగదీస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నిజజీవితంలోనూ కంగన సూర్పణక తరహానే కాబట్టి సూటబుల్. ఇంతకీ ఈ సినిమాలు తీసే దేవుళ్లు ఎవరో ఇంతకీ?