జాన్ గా రాబోతున్న ప్రభాస్..?

0

బాహుబలి తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకరి సుజిత్ డైరెక్షన్లో సాహో కాగా మరోటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రెండు వారాలు గా ఇటలీ లో జరుగుతుంది. హీరోయిన్ పూజా హగ్దే – ప్రభాస్ ల ఫై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటె ఈ సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేసారంటూ కొన్ని టైటిల్స్ సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతూ అభిమానులను కలవరపెడుతున్నాయి.

మొన్నటి మొన్న ఈ చిత్రానికి ఆమూర్ అనే టైటిల్ ఖరారు చేస్తున్నారని ప్రచారం జరుగగా , తాజాగా మరో టైటిల్ వార్తల్లో వినిపిస్తుంది. ‘జాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ప్రచారం అవుతుంది. మరి ఈ రెండు టైటిల్స్ లలో ఏది ఖరారో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రాన్ని గోపికృష్ణ బ్యానర్ సమర్పిస్తుండగా నేషన్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి సైతం మ్యూజిక్ అందిస్తున్నాడు.
Please Read Disclaimer