ప్రభాస్ బాడీపై పర్మినెంట్ గా పడ్డాయ్

0Baahubali-Prabhasబాహుబలి ఇండియన్ సినిమా యాక్షన్ డ్రామా లో ఒక గొప్ప ప్రయోగ ప్రక్రియ కు నాంది పలికింది. ఈ సినిమా కు డిజైన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కానీ.. యాక్షన్ కానీ.. సెట్ డిజైన్ లో కానీ.. ఇలా చాలా విభాగాలలో తమదైనా ముద్ర చూపించారు. డైరెక్టర్ రాజమౌళి చేసిన కృషి ఎంత చెప్పిన తక్కవే. అతను డైరెక్టర్ కాబట్టి చేస్తాడు చేయాలి. కానీ సినిమా లో ఉన్న యాక్షన్ కోసం ప్రభాస్ మరియు రాణా దగ్గుబాటి చూపిన డెడికేషన్ కూడా చరిత్రలో మిగిలిపోతుంది.

ప్రభాస్ ఈ సినిమా లో ఒక రాజుగా.. కొన్ని జాతులు ని పరిరక్షించే యోధుడుగా కనిపిస్తాడు. దాని కోసం కొన్ని వీరోచిత యుద్దాలు చేయవలిసి వస్తుంది కదా. బాహుబలి మొదటి భాగం లోనే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం తను గాయాలు బారిన పడ్డాడు. ఎటువంటి డూప్ ని పెట్టుకోకుండా చేయడం వలన తన శరీరం పై శాశ్వతంగా మిగిలి పోయే మచ్చలు కూడా ఏర్పడిపోయాయట. పర్మినెంట్ గా గాట్లు పడిపోయాయ్. ప్రభాస్ కు ఇక్కట్లు అక్కడితో ఆగిపోలేదు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. బాహుబలి 2 కోసం ఇంకా కష్టమైన యాక్షన్ సీన్లను చాలా అకింతభావం తో చేసి మరిన్ని దెబ్బలు తిన్నాడట. పైగా ఈ 5 ఏళ్ళ కాలంలో.. బాహుబలి లో శివుడు పాత్ర కోసం సన్నబడి (సుమారుగా 86కేజి ).. మళ్ళీ బాహుబలి కోసం 105కేజి పెరిగి.. తను ఈ సినిమా ను ఎంత త్రికర్ణ శుద్ది తో చేశాడో అర్ధవుతుంది.

ఏప్రియల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. ఈ సక్సెస్ తో ఆ గాయాల తాలూకు నొప్పి ప్రభాస్ కు తెలిసే ఛాన్సులేదులే.