కేరళలో అల్లు అర్జున్ ప్లేస్ లో ప్రభాస్

0prabhasబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆయన ఫేస్ బుక్ వాల్లో ఇతర దేశాల నుంచి కూడా ఆయనకు ఫ్యాన్స్ కనిపించడం చూశాం. బాహుబలికి ముందు ప్రభాస్ ను చూస్తే ఆయనేనా ఇతను అనిపించే స్థాయిలో అతనికి క్రేజ్ వచ్చింది. కేరళలోనూ అదే జరిగింది. బాహుబలి-2 రిలీజ్ అయ్యాక కేరళలో ప్రభాస్ కు అభిమానులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇంతవరకు పరభాషా యాక్టర్ల స్థానంలో అల్లు అర్జున్ మళయాళ మూవీ ఇండస్ట్రీలో నెం.1 గా ఉండేవాడు. కానీ బాహుబలి తర్వాత ఆ స్థానంలో హీరో ప్రభాస్ నిలిచారట.

ఇంతకు ముందు కేరళలో ప్రభాస్ సినిమాలు కొన్ని మళయాలంలో విడుదలయ్యాయి. కానీ అవి అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే బాహుబలి లోని అమరేంద్ర బాహుబలి కేరక్టర్ కు మళయాళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ప్రభాస్ కు బ్రహ్మరథం పడుతున్నారు.

గతంలో అల్లు అర్జున్ సినిమాలు ఆర్య – ఆర్య 2 మళయాలంలో రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి అల్లు అర్జున్ కు కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సరైనోడు కూడా భారీ హిట్ ఇచ్చింది. 1990లలో మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు కేరళలో యమ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత అది అల్లు అర్జున్ దక్కించుకోగా… ప్రస్తుతం ఆ స్థాయి క్రేజ్ ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాహో కోసం మళయాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది కూడా హిట్ అయితే ఇక కేరళలో ప్రభాస్ కు తిరుగుండదు.

రాజమౌళి సినిమాలకు కేరళ ప్రేక్షకులుకు వీరాభిమానులు. హీరోలతో సమానంగా ఆయనకు కూడా క్రేజ్ ఉంది. గతంలో మళయాలంలో విడుదలైన ఈగ – మగధీర సినిమాలో ఘన విజయం సాధించాయి.