అప్పుడు అలా… ఇప్పుడు ఇలా: ప్రభాస్

0

ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. గతంలో ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్ లుక్.. ఇప్పుడు ‘సాహో’ కోసం ప్రభాస్ మెయింటైన్ చేస్తున్న లుక్ లో చాలా మార్పు ఉంది. హెయిర్ స్టైల్.. గడ్డం.. మీసం మాత్రమే కాదు వెయిట్ లో కూడా డిఫరెన్స్ ఉంది. ‘సాహో’ సినిమా కోసం 8 కేజీలు తగ్గానని రీసెంట్ గా తెలిపాడు ప్రభాస్.

‘బాహుబలి’ లో ఆ పాత్రలకు తగ్గట్టుగా భారీకాయంతో కనిపించాల్సి వచ్చిందని అయితే ‘సాహో’ ప్రారంభం అయ్యే సమయంలోనే డైరెక్టర్ సుజిత్ పాత్ర కు తగ్గట్టుగా స్లిమ్ గా మారాలని కోరాడని తెలిపాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కావడం తో హై ఎండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని.. అలాంటి సీన్స్ లో స్లిమ్ గా.. ఫిట్ గా కనిపిస్తే బాగుంటుందని డైరెక్టర్ చెప్పాడట. అందుకే కార్బోహైడ్రేట్స్ అతి తక్కువగా ఉండే డైట్ ఫాలో అవుతూ తక్కువ సమయంలోనే 8 కేజీలు తగ్గానని చెప్పాడు.

‘బాహుబలి’ సమయంలో తన డైట్ లో రోజూ 20 ఎగ్ వైట్స్.. బ్రౌన్ రైస్.. అర్థకిలో చికెన్ ఉండేదని తెలిపాడు. కానీ ఇప్పుడు ‘సాహో’ కోసం కార్బో హైడ్రేట్స్ లేకుండా పండ్లు.. కూరగాయలు ఉండే డైట్ ఫాలో అవుతున్నానని చెప్పాడు. సినిమాలో తను పోషించే పాత్ర కోసం ఎంత కష్టమైనా భరించే హీరోలలో ప్రభాస్ ఒకరు. వెయిట్ పెరగాలన్నా.. తగ్గాలన్నా.. కఠినమైన ఎక్సర్ సైజులు చెయ్యాలన్నా ప్రభాస్ వెనకడుగు వేయడు.. మరి ఆ డెడికేషనే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది.
Please Read Disclaimer