అరెరే.. ప్రభాస్ పెళ్లి ముహూర్తం పెట్టేశారే

0Prabhas-400ప్రభాస్ పెళ్లి.. టాలీవుడ్ లో చాలా కాలం నుంచి ఈ అంశం హాట్ టాపిక్ గానే నడుస్తోంది. ప్రభాస్ ఇంటివాళ్లు ఇంకా అసలు విషయమేమీ చెప్పలేదు కానీ.. ఇప్పటికే చాలానే ముహూర్తాలు పెట్టేసి.. బోలెడు అమ్మాయిలతో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వండి వారించి వడ్డించేశారు.

బాహుబలి కంప్లీట్ అయ్యాక ప్రభాస్ పెళ్లి అనే న్యూస్ బాగానే హంగామా చేసింది కానీ.. ఇప్పుడది కూడా చప్పబడిపోయింది. ఇలాంటి సమయంలో.. ఈ ఏడాది సెప్టెంబర్ నవంబర్ మధ్యలో మాంచి ముహూర్తం చూడమని పండితులకు కృష్ణంరాజు చెప్పారంటే ఓ వార్త గుప్పుమంది. ఇది ప్రభాస్ నిశ్చితార్ధం కోసం ఆయన అడిగారని.. పెళ్లి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉంటుందనేది ఈ రూమర్ సారాంశం. అసలు ఈ పుకారు ఎవరు పుట్టించారో తెలీదు కానీ.. దీని దెబ్బకు ప్రభాస్ జాతకం చెప్పేస్తున్నారు పలువురు పండితులు. అసలు పెళ్లి కూతురు ఎవరో తెలియదు.. జాతకాలో కలిశాయో లేదో అంతకంటే తెలియదు.

కానీ ఇంతలోనే ‘ప్రభాస్ కి సెప్టెంబర్ నుంచి శాంతియుతమైన జీవనం మొదలవుతుంది. 2018లో ఓ ఇంటివాడవుతాడు. మార్చ్ లో ఆ శుభ ఘడియలు ప్రారంభం కానుండగా.. ఉత్తరాయణంలోనే పెళ్లయిపోతుంది’ అంటూ పలువురు జాతకాలు చెప్పేస్తుంటే.. జనాలు నవ్వుకుంటున్నారు.