‘బాహుబలి’కి భీమవరం వధువు!

0prabhas‘బాహుబలి’ ప్రభాస్‌ పెళ్లెప్పుడు?ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషయం గురించి గతంలో ప్రభాస్‌ను మీడియా ప్రశ్నిస్తే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఏప్రిల్‌ 28న తెలిసింది కదా. ప్రభాస్‌ పెళ్లెప్పుడు అన్న విషయం కూడా ఏదో ఒక 28న తెలుస్తుంది’ అని చెప్పాడు.

అయితే ప్రభాస్‌ పెళ్లి విషయమై కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. భీమవరంకి చెందిన ఓ వ్యాపారవేత్త మనవరాలితో ప్రభాస్‌ పెళ్లిజరగనున్నట్టు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై ప్రభాస్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.