జిల్ జిల్ గా ప్రభాస్

0

ప్రభాస్ అనగానే మ్యాన్లీ మాచో లుక్ ప్రేక్షుకుల కళ్ళ ముందు మెదులుతుంది.అందుకే ప్రభాస్ దాదాపుగా మీసాల్లేని లుక్ లో కనిపించడు. కానీ ప్రభాస్ తాజా లుక్ మాత్రం ఫ్యాన్స్ కే కాదు అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉంది. మీసాల్లేకుండా ఒక బాలీవుడ్ హీరోలా మారిపోయాడు. కాస్ట్యూమ్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో కొత్తగా కనిపిస్తున్నాడు.

ఇంతకీ ఈ గెటప్ వెనక సీక్రెట్ ఏంటి అంటే.. ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రంలో ప్రభాస్ మీసాల్లేకుండా క్లీన్ షేవ్ లో కనిపిస్తాడట. ఈ సినిమా మెజారిటీ భాగం ఇటలీలో చిత్రీకరిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభాస్ టీమ్ ఇప్పటికే ఇటలీకి బయలుదేరి వెళ్లారట. అక్కడ లోకల్ గవర్నమెంట్ అఫిషియల్స్ ను కలిసినప్పుడు తీసిన ఫొటోనే ఇది.

ఈ సినిమా 1950 నేపథ్యంలో ఇటలీలో జరిగిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అట.. ప్రభాస్ ఇందులో ఒక జ్యోతిష్కుడి పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం అవుతుందని సమాచారం. UV క్రియేషన్స్.. గోపికృష్ణ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Please Read Disclaimer