ప్రభాస్ – నిహారిక ల పెళ్లి ఫై చిరు స్పందన..

0సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది..ఏదో నిజమో..ఏది అబద్దమో తెలుసుకోకుండా పలు వార్తలను తెగ ప్రచారం చేస్తూ అందరిని షాక్ లో పడేస్తున్నారు. ముఖ్యం గా సినిమా పరిశ్రమలోని స్టార్స్ కు సంబదించిన చావు , పెళ్లిళ్ల గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

దీంతో చాలామంది మెగా ఫ్యామిలీ సబ్యులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారట. ఈ విషయం కాస్త మెగా స్టార్ చిరంజీవి దగ్గరి వరకు వెళ్లడం తో ఆయన చాల సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అసలు ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఆయన ఇలా ఎలా ప్రచారం చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడట. గ‌తంలో నిహారిక పెళ్లి సాయిధ‌ర‌మ్ తేజ్‌తో జ‌ర‌గ‌నుంద‌ని పుకార్లు షికారు చేయ‌గా, ఆ త‌ర్వాత నాగ శౌర్య‌తో అంటూ రూమ‌ర్స్ స్ప్రెడ్ చేశారు. వీటిని మెగా ఫ్యామిలీ ఖండించింది. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ తోనని చేయడం తో మెగా ఫ్యామిలీ అంత బాగా సీరియస్ అవుతున్నారని సమాచారం.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉంటే, నిహారిక ఒరు నల్ల నాల్ పాత్రు సోల్రెన్ అనే త‌మిళ‌ చిత్రంతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రాలు చేస్తుంది.