ప్రేమ కోసం ప్రభాస్ తంటాలు!!

0

డార్లింగ్ ప్రభాస్ `దిల్వాలే దుల్హానియా లేజాయేంగే` (డీడీఎల్జే) తరహా ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారా? అంటే అవుననేందుకు ప్రూఫ్ కనిపిస్తోంది. కింగ్ ఖాన్ షారూక్ – కాజోల్ జంటగా యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన `డీడీఎల్జే` నాడు ఎంతటి సంచలనమో తెలిసిందే. ఆ సినిమాని మెజారిటీ పార్ట్ స్విట్జర్లాండ్‌లోని బ్యూటిఫుల్ నేచుర్ మధ్య తెరకెక్కించారు. షారూక్ – కాజోల్ జంట ఎటర్నల్ లవ్‌స్టోరిని యూత్ ఓ రేంజులో ప్రేమించి మరీ థియేటర్లలో చూశారంటే ఆ సినిమా యాంబియెన్స్ అంతగా ఆకట్టుకుంది కాబట్టే. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏళ్లకు ఏళ్లు థియేటర్లో ఆడిన సినిమాగా డీడీఎల్జే సంచలనం సృష్టించింది.

అందుకే ఇప్పుడు డార్లింగ్ ఆ ఫార్ములాని క్యాచ్ చేసి అదే తరహా ప్రేమకథలోనే నటిస్తున్నాడన్న మాటా వినిపిస్తోంది. డీడీఎల్జే విజయంలో ఆ సినిమాకి ఉపయోగించిన స్విస్ లొకేషన్లే సగం పాత్ర పోషించాయన్నది ఓ విశ్లేషణ. సరిగ్గా అదే ఫార్ములాని ప్రభాస్ – జిల్ రాధాకృష్ణ బృందం ఉపయోగిస్తున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ బృందం ఇటలీ కోమో-లాంబార్డీ అనే అరుదైన ఎగ్జోటిక్ లొకేషన్లలో చిత్రీకరణలో పాల్గొంటోంది. అక్కడ ప్రకృతి అందాలు సినిమా ఆద్యంతం మత్తెక్కించే ఫీల్‌ని కలిగిస్తాయని చెబుతున్నారు. వీటన్నిటినీ మించి ఈ లవ్‌స్టోరి ఆద్యంతం యూరప్-ఇటలీలో 1940 కాలంలో సాగుతుంది కాబట్టి అందుకు తగ్గ యాంబియెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. నాటి జనం ఉపయోగించిన ఖరీదైన వింటేజ్ కార్లు పాత కాలం బస్సుల్ని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో లీకై హల్ చల్ చేస్తున్నాయి. ఇటలీలో ప్రభాస్ – పూజా హెగ్డే జంట మధ్య ప్రేమ సన్నివేశాలు మైమరిపిస్తాయని లీకైన ఫోటోలు చెబుతున్నాయి.

`రంగస్థలం` సక్సెస్ తర్వాత పాత కాలంలోకి వెళ్లి అక్కడ కొత్త కథల్ని వెతుక్కోవడం మన దర్శకరచయితలకు అలవాటు వ్యాపకంగా మారింది. ఈ కోవలోనే ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమాకి నాటి కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. 1940బ్యాక్ డ్రాప్‌కి తగ్గట్టు వేషం భాష అన్నీ మార్చేశారు. మారిన ప్రభాస్ లుక్ ఇప్పటికే వెబ్‌లో లీకై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో పూజా లుక్ ఎలా ఉండబోతోందో ఓ సర్ప్రైజ్. గోపికృష్ణ మూవీస్- యువిక్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇటలీ ఎగ్జోటిక్ లొకేషన్లతో డీడీఎల్జే తరహా మ్యాజిక్ ఈ ప్రేమకథా చిత్రానికి వర్కవుటవుతుందేమో చూడాలి.
Please Read Disclaimer