ప్రభాస్ ఆలోచన కరెక్టేనా

0

బాహుబలి 2 వచ్చి రెండేళ్ళు అవుతున్నా అభిమానులు ఓపికగా సాహో కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 15 విడుదల అని చెప్పేశారు కాబట్టి ఇక అందులో మార్పేమీ ఉండదనే ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి పుణ్యమా అని నేషనల్ లెవెల్ లో మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ ఇకపై కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయినట్టుగా టాక్.

ఇప్పటికే సాహో మల్టీ లాంగ్వేజ్ వెర్షన్స్ లో షూట్ చేస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని కూడా హిందిలో కూడా తీస్తున్నట్టు టాక్. అంటే తన ఇమేజ్ కి కేవలం సౌత్ కే పరిమితం చేసుకోకుండా నార్త్ లో బలంగా జెండా పాతే ప్రోగ్రాం చేస్తున్నాడన్న మాట. కరణ్ జోహార్ ఎప్పటి నుంచో ఈ విషయంగానే ప్రభాస్ ని ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే

కాని ఇక్కడో రిస్క్ ఉంది. దక్షిణాది హీరోలు ఉత్తరాదిలో ఎక్కువ కాలం రాణించడం కష్టం. చరిత్ర చాలా సార్లు రుజువు చేసింది. ఎన్టీఆర్ మొదలుకుని చిరంజీవి దాకా ఎవరూ అక్కడ బలమైన ముద్ర వేయలేకపోయారు. బాహుబలి అక్కడ చరిత్ర సృస్టించడానికి కారణం ప్రభాస్ ఇమేజ్ కాదు. అందులో ఉన్న కంటెంట్ ప్లస్ గ్రాఫిక్స్.

తర్వాత డార్లింగ్ కు అక్కడో ఇమేజ్ వచ్చింది. అయితే దాన్ని బట్టే ప్రతి సినిమాను బాహుబలి రేంజ్ లోనే రిసీవ్ చేసుకుంటారన్న గ్యారెంటీ లేదు. అందుకే సాహోతో పాటు రాధాకృష్ణ ఫలితాలు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. మరి ప్రభాస్ స్ట్రాటజీ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో తేలేది అప్పుడే
Please Read Disclaimer