తనని అలా పిలవొద్దని బాలీవుడ్ కి ప్రభాస్ విజ్ఞప్

0prabhas-latest-picఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండటం అంటే ఇదేనేమో! బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కి డార్లింగ్‌గా పేరున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు. బాహుబలి విజయంతో అంతెత్తుకు ఎదిగినా కానీ సింప్లిసిటీలో మాత్రం మరింత ఒదిగిపోయాడు ప్రభాస్. ప్రభాస్ సింప్లిసిటీ ఏంటో టాలీవుడ్ ఆడియెన్స్‌కి తెలియనిది కాదు కానీ ఇటీవల జరిగిన ఓ పార్టీతో అతడి మనస్తత్వం, స్వభావం ఏంటనేది బాలీవుడ్ ప్రముఖులు, ఆడియెన్స్‌కి కూడా తెలిసిపోయింది.

ఇటీవల కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన బాహుబలి 2 సక్సెస్ పార్టీకి హాజరైన ప్రభాస్ అక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ప్రభాస్‌ని అభినందించిన బాలీవుడ్ స్టార్స్ అతడితో కలిసి తీసుకున్న సెల్ఫీలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తనతో సంభాషించే సమయంలో బాలీవుడ్ స్టార్స్ తనని పదేపదే ‘సర్’ అని పిలుస్తుండటంపై ప్రభాస్ కొంత ఇబ్బందికి గురయ్యారట. తనని అలా పిలిచిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ వంటి హీరోలతో దయచేసి తనని అలా ‘సర్’ అని పిలవకుండా ప్రభాస్ అని పేరు పెట్టి పిలవాల్సిందిగా సూచించారట ప్రభాస్.

ప్రభాస్ చేసిన ఆ విజ్ఞప్తిపై స్పందించిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ ఇద్దరూ… ” మీరు ( ప్రభాస్) మాకు బాహబలి! మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవలేం” అని బదులిచ్చారట సరదాగా. దటీజ్ డార్లింగ్ ప్రభాస్..