ప్రభాస్ డార్లింగ్ వచ్చేశాడు

0డార్లింగ్ బాహుబలి ప్రభాస్ గత కొంత కాలంగా సాహో చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ రెండు నెలల క్రిందట దుబాయ్ కి వెళ్ళింది. అక్కడ ప్రముఖ నగరమైన అబూ ధాబీలో దాదాపు రెండు నెలల వరకు నిరంతరం షూటింగ్ జారిపరు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ కెన్నీ బెట్స్ స్టంట్స్ ను చిత్రీకరించారు.

హాలీవుడ్ బారి యాక్షన్ సినిమాలకు పని చేసిన అనుభవం ఉన్న ఆ యాక్షన్ కోరియేగ్రాఫర్ అనుకున్న సమయానికి స్టంట్స్ ఫినిష్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే మొత్తానికి ఈ షెడ్యూల్ ముగించుకొని ప్రభాస్ హైదరాబాద్ లో రీసెంట్ గా అడుగుపెట్టాడు. ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ లో ఒక సినిమా షూటింగ్ కోసం రెండు నెలలు ఫారిన్ షెడ్యూల్ వేసుకోవడం ఇదే మొదటిసారి. యువ దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నెక్స్ట్ సాహో షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ లోనే జరపనున్నారు. ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. మరికొన్ని సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలల్లో ప్రభాస్ మరో సినిమాను మొదలు పెట్టె అవకాశం ఉంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథకు ప్రభాస్ ఎప్పుడో పడిపోయాడు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్ట్ ని కూడా ఫినిష్ చెయ్యాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు టాక్.