రాజకీయాలపై ప్రభాస్ అభిప్రాయం!

0prabhas-latest-photoసినిమాల్లో ఓ వెలుగు వెలిగే వాళ్లంతా ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారా అనే సందేహాలు రావడం చాలా మామూలే. అందులోనూ వాళ్ల కుటుంబీకులు ఎవరైనా అప్పటికే రాజకీయాల్లో వుండి వుంటే, వారి విషయంలో ఈ పుకార్లు ఇంకాస్త ఎక్కువగానే వుంటాయి. అలాగే బాహుబలి స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇటువంటి సందేహాలే కలిగాయి. నటుడు కృష్ణంరాజుకి తమ్ముడి కొడుకైన ప్రభాస్ కృష్ణంరాజులాగే భవిష్యత్‌లో రాజకీయాలవైపు ఆసక్తి కనబరుస్తారా అనే ప్రశ్నలు అక్కడక్కడా వినిపించేవే.

తాజాగా బాహుబలి 2 ప్రమోషన్స్‌లో బిజీగా వున్న ప్రభాస్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన ప్రభాస్… రాజకీయాలపై తనకి అంతగా ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. ‘తాను రాజకీయాలకి సూట్ కాను అని కుండబద్ధలు కొట్టిన ప్రభాస్.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు’ అని స్పష్టంచేశారు.

తన పెదనాన్న కృష్ణంరాజు ఎంపీగా వున్నప్పుడు నియోజకవర్గంలోని సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించే బాధ్యత నాకు అప్పగించారు. ఓ నెల రోజుల పాటు ఆ డ్యూటీ చేసేటప్పటికీ నాకు సరిపోయింది. మళ్లీ తనని ఎప్పుడూ ఈ రాజకీయాల్లోకి లాగొద్దు అని పెదనాన్నని రిక్వెస్ట్ చేశాను అంటూ ఓ పాత జ్ఞాపకాన్ని సైతం ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు.