బాహుబలి-3.. రాజమౌళి ఫోన్‌తో షాకైన ప్రభాస్!

0Prabhas-s-shocking-reaction‘బాహుబలి’ ప్రాజెక్టు కోసం హీరో ప్రభాస్ తన కెరీర్‌ను పనంగా పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నాలుగేళ్ల పాటు ఇతర సినిమాలేవీ చేయకుండా కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే తన పూర్తి సమయం కేటాయించాడు.

అంతే కాకుండా…. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించాడు. అఫ్ కోర్స్ ప్రభాస్ పడ్డ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభించింది. అయితే బాహుబలి లాంటి మరో ప్రాజెక్టు మాత్రం చేయడానికి ప్రభాస్ సిద్ధం లేడు. అయితే రాజమౌళి ఫోన్ చేసి బాహుబలి-3 చేద్దామని అడగ్గానే ప్రభాస్ షాకయ్యాడు. ఓ టీవీ షోలో భాగంగా ప్రభాస్ ను ఆటపట్టించడానికి రాజమౌళి ఇలా చేశాడు.

రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ అనే కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్‌ను ఆటపట్టించారు రాజమౌళి. ప్రభాస్ కు ఫోన్ చేసి…. అర్జంటుగా నిన్ను కలవాలి, బాహుబలి-3 గురించి మాట్లాడాలని అనగానే ప్రభాస్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్టికల్ చివర్లో వీక్షించండి.

ఈ షోలో భాగంగా రాజమౌళి విల్లంబు ఎక్కుపెట్టి బాణాలు ప్రయోగించే ఆట ఆడారు. పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుని బాణం వేయగానే సెంటర్లో తగిలింది. ఎంతో ఆసక్తికరంగా ఈ షో సాగింది.

ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోను మీరూ వీక్షించండి