సాహోకు గుమ్మడికాయ కొట్టేస్తారా?

0

అవుననే అంటున్నాయి యూనిట్ వర్గాలు. అయితే అఫీషియల్ గా కాదు లెండి. గత రెండేళ్ళుగా షూటింగ్ లో ఉన్న సాహో ఎప్పుడు చూస్తామా అని అభిమానులు కోటి దీపాలను కళ్ళలో వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. తమ హీరో ప్రభాస్ సినిమా రెండేళ్ళకు ఒకటి రావడం కూడా అంచనాల మీద విపరీత భారాన్ని మోపుతోంది. ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం సాహో షూటింగ్ ఫినిషింగ్ స్టేజి లో ఉంది.

ప్రస్తుతం ముంబైలో ఉన్న టీం అక్కడ కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుని ప్రభాస్ శ్రద్ధా కపూర్ మీద డ్యూయెట్ కోసం యురప్ వెళ్లనుంది. అది పూర్తయ్యాక రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం డార్లింగ్ అక్కడే కంటిన్యూ అవుతాడు. మిగిలిన టీం ఇండియాకు రిటర్న్ వచ్చి ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేస్తుంది

ఇది ఆఘమేఘాల మీద చేస్తే తప్ప ఆగస్ట్ 15 విడుదల సాధ్యం కాదు. దర్శకుడు సుజిత్ కాని నిర్మాణ సంస్థ యువి కాని ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. షేడ్స్ అఫ్ సాహో పేరుతో రెండు వీడియోలను విడుదల చేయడం తప్ప పబ్లిసిటీ పరంగా సాహోలో ఎలాంటి మూమెంట్ లేదు. చేతిలో ఉన్న సమయం కేవలం మూడున్నర నెలలు.

పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్ ఆషామాషీగా చేస్తే సరిపోదు. దేశం నలుమూలలకు వెళ్ళాల్సి రావొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. సో టీం మీద ప్రెజర్ మాములుగా ఉండదు. గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం ప్రతి ఒక్కరు రెస్ట్ లేకుండా ఉరుకులు పరుగులు మీద పని చేయాల్సిందే. అంత సవ్యంగా పూర్తయితే టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ ని ఆగస్ట్ 15 చూసేయోచ్చు
Please Read Disclaimer