ప్రభాస్ సోదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

0prabhas-sistersబాహుబలి సినిమాతో ప్రభాస్ పెద్ద హీరో అయిపోయాడు. ప్రభాస్‌ అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగానే కెరీర్లో ఉన్నత స్థానాలను అందుకున్నాడు. ఇక అభిమానుల్లో ఉన్న బెంగ అతడి పెళ్లి విషయం మాత్రమే.

పెళ్లి విషయంలో ప్రభాస్ ఎవరి మాట వినడం లేదట. ఇంట్లో వాళ్లు చాలా సంబంధాలు చూస్తున్నా…. ఏ ఒక్కదానికి ఒకే చెప్పడం లేదట. అసలు ప్రభాస్ మనసులో ఏముందో కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావడం లేదు. తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ప్రభాస్ సోదరి సాయి ప్రకీర్తి తన సోదరుడు ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కృష్ణం రాజుకు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, సాయి ప్రసీద అనే ముగ్గురు కుమార్తెలున్న సంగతి తెలిసిందే. వీరి కుటుబంలో ఏకైక వారసుడు ప్రభాస్. తన ముగ్గురు సిస్టర్స్‌ను ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారట. ప్రభాస్ తమతో ఎలా ఉంటాడనే విషయాన్ని సాయి ప్రకీర్తి వెల్లడించారు.

అన్నయ్య మాతో చాలా క్లోజ్‌గా ఉంటారు. షూటింగులు లేకుంటే ఎక్కువ సమయం మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. అన్నయ్య అంటే మాకు ఎంతో గౌరవం, అన్నయ్యకు మేమంటే ఎంతో ప్రేమ. మా ఇష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదో ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు అని సాయి ప్రకీర్తి తెలిపారు.

అందరిలాగే అన్నయ్య పెళ్లి గురించి మేము కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? డేట్ ఎప్పుడు? అనేది మాకు కూడా తెలియదు అని సాయి ప్రకీర్తి తెలిపారు.

అన్నయ్య చాలా మంచి వ్యక్తి…. మా జీవితంలో మేము చూసిన ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్‌లో అన్నయ్య ఒకరు. అలాంటి వ్యక్త మాకు బ్రదర్‌గా దొరకడం మా అదృష్టం అని సాయి ప్రకీర్తి వెల్లడించారు.

ప్రభాస్ పెళ్లి గురించి బయట అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అనుష్కను పెళ్లాడబోతున్నట్లు కూడా ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు.

వయసు 40కి దగ్గరవుతున్న పెళ్లి విషయంలో ప్రభాస్ చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికి కూడా పెళ్లి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.

ఇంట్లో ఖాళీగా ఉంటే పెళ్లి పేరుతో ఇంట్లో నస పెడతారనే ఉద్దేశ్యంతో సినిమా కమిట్మెంట్లు, విదేశీ టూర్లు లాంటివి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇవేమీ లేకుంటే ముంబైలో కొత్త పరిచయం అయిన బాలీవుడ్ ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేస్తున్నాడట.