వైఎస్ యాత్రకు బాహుబలి అండ

0ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పై గత కొంత కాలంగా కసరత్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నటినటుల గురించి చిత్ర యూనిట్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఆల్ మోస్ట్ క్యారెక్టర్స్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు బ్యాక్ సపోర్ట్ గా బాహుబలి ప్రభాస్ నిలవనున్నాడు. ఈ బయోపిక్ కి యాత్ర అనే టైటిల్ ను సెట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నిర్మాత విజయ్ ప్రభాస్ కి మంచి స్నేహితుడు. స్నేహితులు అంటే చాలు ప్రభాస్ తనకు నచ్చిన విధంగా సపోర్ట్ చేస్తుంటాడు. ఇప్పటికే వాళ్ల సన్నిహితుల యూవీ క్రియేషన్స్ స్థాయిని పెంచడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఇప్పుడు విజయ్ అనే తన ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గా మారాడని యాత్ర సినిమాకు కచ్చితంగా తనకు వీలైనంత వరకు మద్దతుగా ఉంటానని ప్రబాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంటే సినిమాకు ప్రమోషన్స్ ఈజీగా వచ్చినట్లే!!

ఆనందో బ్రహ్మ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి వి రాఘవ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గుడలోని ఒక హౌస్ లో షూటింగ్ మొదలైంది. మొదట వైఎస్ పాలిటిక్స్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. వైఎస్ పాత్రలో మలయాళం స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా విజయమ్మ పాత్రలో బహుబలి ఫెమ్ ఆశ్రిత నటించనున్నారు.