మీడియా వారికి ప్రభాస్ కాక్టెయిల్ పార్టీ

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో హడావుడి మామూలుగా లేదు. జాతీయ స్థాయిలో ప్రభాస్ బర్త్ డే కు సంబంధించిన ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ నుండి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ ఒక యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను విడుదల చేయడం జరిగింది. అందులో ప్రభాస్ లుక్ – యాక్షన్ సీన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ప్రభాస్ నేడు సాయంత్రం ఫిల్మ్ నగర్ లో ఇవ్వబోతున్నాడు.

మీడియాకు చెందిన పలువురికి ప్రభాస్ నేడు రాత్రి కాక్టెయిల్ పార్టీని అరేంజ్ చేశారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు – వీడియో గ్రాఫర్స్ – ఫొటోగ్రాఫర్స్ తో పాటు పలువురు పీఆర్ ఓ లకు ఇప్పటికే ప్రభాస్ టీం నుండి పార్టీకి ఆహ్వానం అందింది. ప్రభాస్ మీడియాకు పార్టీ ఇవ్వడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ ఈ పార్టీకి హాజరై మీడియా వారితో సరదాగా గడపబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో పాటు ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ఇటలీలో ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. త్వరలో ‘సాహో’ చిత్రీకరణలో పాల్గొనబోతున్న ప్రభాస్ ఆ చిత్రాన్ని వచ్చే వేసవి సమ్మర్ లో తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
Please Read Disclaimer