పాప్ గాయకుడికి ప్రభాస్ పార్టీ

0ఉరకలెత్తే ఉల్లాసానికి కేరాఫ్ అడ్రెస్ అతడు. మనసు కవిలా ఊహాలోకంలో తేలే ఎన్నో మెలోడియస్ ఆల్బమ్స్ తో ప్రపంచానికి సుపరిచితం. పాశ్చాత్య గాయకుడే అయినా అతడికి ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ పేరు వింటేనే షివరింగ్ వచ్చేస్తుంది యూత్ కి. అంత గొప్ప ప్రతిభావంతుడు కాబట్టే అతడు అక్టోబర్ లో భారతదేశానికి వస్తున్నాడు అని తెలియగానే ఇక్కడ సెలబ్రిటీలంతా ఎలెర్ట్ అయిపోయారు. ది గ్రేట్ బ్రయాన్ ఆడమ్స్ గురించే ఇదంతా.

పాప్ గాయకుడు బ్రయాన్ ఆడమ్స్ ఇండియా టూర్ ఈ అక్టోబర్ లో ఉండనుంది. అందుకు ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ సాగుతున్నాయి. బ్రయాన్ కాన్సెర్ట్ కోసం ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ అంతటివాడే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. అతడితో రెహమాన్ సాన్నిహిత్యం గురించి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బ్రయాన్ ఇండియా టూర్ కి వెల్ కం చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది.

అదంతా అటుంచితే.. మన టాలీవుడ్ నుంచి బ్రయాన్ని ఇన్వయిట్ చేస్తున్నది ఎవరు? అన్న ప్రశ్నకు ఇదిగో డార్లింగ్ ప్రభాస్ చక్కని ఆన్సర్ ఇచ్చాడు. బ్రయాన్ ఇండియా వచ్చి – హైదరాబాద్ లో అడుగుపెట్టగానే అతడికి ఘనమైన విందు ఇచ్చేందుకు ప్రభాస్ ప్లాన్ చేసేశాడు. ఒక అంతర్జాతీయ గాయకుడికి ప్రభాస్ పార్టీ ప్లాన్ చేశాడంటే దాని వెనక ప్లాన్ అంతే ఘనమైనది అని అర్థం చేసుకోవచ్చు. మంచి సత్సంబంధాలు మార్కెట్ రేంజును పెంచుతాయి. ఆ సూత్రాన్ని తూ.చ తప్పక ఆచరిస్తున్నాడు మన డార్లింగ్. ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం `సాహో`కి హాలీవుడ్ లో కావాల్సిన ప్రమోషన్ బ్రయాన్ వల్ల వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాహో ఒక మ్యాట్రిక్స్ తరహా యాక్షన్ సినిమా కాబట్టి పాశ్చాత్య దేశాల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడం కష్టమేమీ కాదు. అయితే అందుకు `బాహుబలి` టీమ్ స్కెచ్ లా ప్రమోషనల్ స్ట్రాటజీ డిఫరెంటుగా – భారీ స్కేల్ తో ఉండాలి. ప్రస్తుతం డార్లింగ్ చేస్తోంది అదే!