రానా 3డి పోస్టర్ తో బాహుబలి

0



సినిమా ప్రచారంలో టెక్నాలజీని వాడి ప్రేక్షకులు ముందుకు సరికొత్తగా తీసుకువెళ్తున్నారు మన మూవీ మేకర్స. ఇప్పుడు రానా దగ్గుబాటి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం 3డి మోషన్ పోస్టర్ ని అగ్మెంటెడ్ రియాలిటీ(AR) టెక్నాలజీ వాడి డిజైన్ చేశారు. ఈ మొబైల్ అప్ స్టార్ డౌన్లోడ్ చేసి మూవీ పోస్టర్ ముందు నిల్చోని AR అప్ ద్వారా ఫోటో తీసుకుంటే మన ఫోటోతో పాటుగా రానా లైవ్ ఫోటో జతపడి వస్తుంది. ఈ రకమైన పోస్టర్ తో రానా తన కొత్త సినిమా ప్రచారం విభిన్నంగా చేస్తున్నాడు.

ఇలా ఇంత వరకు తెలుగులో ఏ సినిమాకు ప్రచారం చేయలేదు. ఈ 3డి పోస్టర్ తో ఫాన్స్ ఫోటో తీసుకొని వింత అనుభవాన్ని పొందుతుంటే మరో పక్క బాహుబలి కూడా ఆ ఫోటో అనుభవాన్ని ఆనందిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రభాస్ రానా 3డి పోస్టర్ ముందు నిలబడి ఉన్నాడు రానా ప్రభాస్ ని ఫోటో తీస్తున్నాడు. మొబైల్ లో మీరు చూడవచ్చు ప్రభాస్ పక్కన రానా తన సినిమాలో గెటప్ తో ఒక కొత్త ఫోటో జతపడి వస్తుంది. సినిమా హీరోతో మనం ఫోటో తీసుకోవాలి అనుకుంటాం కానీ అందరికి ఆ అవకాశం దొరకవచ్చు దొరకపోవచ్చు. కానీ ఇటువంటి పోస్టర్ ద్వారా మనం నిజంగానే ఆ హీరో పక్కన ఉండే తీసుకున్నామా అనేలా కనిపిస్తుంది.

యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో నేనే రాజు నేనే మంత్రి విడుదలకాబోతున్న థియేటర్లో ఉన్న 3డి పోస్టర్ వద్ద మీరు కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. రానా కాజల్ జంటగా నటించిన ఈ సినిమాను తేజ డైరెక్ట్ చేయగా సురేశ్ బాబు నిర్మించారు. అనూప్ రుబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చే నెల ఆగష్టు 11 న విడుదలకాబోతుంది.Prabhas-with-Rana-Nene-Raju-Nene-Mantri-3D-Poster