కంచె లేని సొగసులు

0క్రిష్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముంబై భామ ప్రగ్యా జైస్వాల్. తర్వాత కొన్ని సినిమాలలో కనిపించినా అవేవీ బ్రేక్ ఇవ్వలేదు. అలా అని ప్రగ్య నిరాశలో కూరుకుపోలేదు. తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇతర బ్యూటీల మాదిరిగానే అప్డేటెడ్ గా ఉంటోంది.

ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఘాటు ఫోటోలు పెడుతూ ఫిలింమేకర్స్ కు నేనున్నాను అని హింట్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఒక బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ‘పిజ్జా??’ అనే క్యాప్షన్ పెట్టింది. అంటే ఆమె పిజ్జా తినడానికి రెడి అవుతోందో లేదా ‘నేను పిజ్జా లాగా ఉన్నాను కదా?’ అని అడుగుతోందో మాత్రం అర్థం కావడం లేదు. ఒకవేళ రెండోదే కనుక ఆమె ప్రశ్న అయితే మాత్రం పిజ్జాలా ఎం ఖర్మ.. రవి వర్మ కుంచె నుండి జాలువారిన అతిలోక సుందరి లా ఉంది కంచె బ్యూటీ.

ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా’ లో నటిస్తోంది. ఇది తప్ప చేతిలో వేరే అవకాశాలు లేవు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇక గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసేలానే ఉంది.