ఈ సోయగాన్ని కంచె దాటించేదెవరో

0కంచె అంటూ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ లో మంచి ఆరంభాన్నే అందుకుంది. ఆ సినిమా తొలి చిత్రం కాకపోయినా.. అంతకు ముందే తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు మూవీలో కనిపించినా.. తన అరంగేట్ర చిత్రం కంచె అంటూ కలరింగ్ ఇచ్చి బాగానే ఫేమ్ సంపాదించుకుంది.

కంచెతో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడంలో మాత్రం ప్రగ్య పూర్తిగా ఫెయిల్ అయింది. ఓం నమో వెంకటేశాయ.. గుంటూరోడు.. నక్షత్రం.. జయ జానకి నాయక.. ఆచారి అమెరికా యాత్ర అంటూ వరుసగా అన్ని సినిమాలు టపా కట్టేశాయి. ఆయా సినిమాలూ ఆడలేదు.. వాటిలో ఈమె పాత్ర గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ప్రగ్యాకు తలెత్తింది. రీసెంట్ గా జీక్యూ మేగజైన్ కు హాట్ హాట్ పోజులు ఇచ్చి మరీ ఫోటో షూట్ చేసిన ఈ బ్యూటీ.. రెడ్ కలర్ డ్రెస్ లో రకరకాల యాంగిల్స్ లో తన అందాలను బాగానే ఎక్స్ పోజ్ చేసింది.

ఇవన్నీ తనకు అవకాశాలు ఇవ్వమని.. తను గ్లామర్ షో చేయడానికి సిద్ధమే అని ఇన్ డైరెక్టుగా చెబుతున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ అందాల భామకు మాత్రం అనుకున్న స్థాయిలో.. ఆశించిన విధంగా ఛాన్సులు అందడం లేదు. మరి ప్రగ్య కెరీర్ కు పడిపోయిన కంచెను.. ఏ దర్శుడు తెంచుతాడో.. ఈ హీరో ఈ అందాల భామ కెరీర్ ను గాడిలో పెడతాడో చూడాలి.