రామ్ కు ప్రకాష్ రాజ్ ప్రేమ పాఠాల పాట!

0

Prakash-Raj-and-Ram-Sings-for-Hello-Guru-Prema-Kosame-Movieహీరోలు గొంతు సవరించుకోవడం చాలా రోజులనుండి టాలీవుడ్ లో ఒక ట్రెండ్. చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు నుండి ఈ జెనరేషన్ హీరో విజయ్ దేవరకొండ ‘వాట్ ది ఎఫ్’ వరకూ దాదాపుగా చాలామంది హీరోలు ఏదో ఒక సందర్భంలో తమ సినిమాలకోసం పాట పాడిన వారే. ఇలా హీరోల చేత పాడించే సంగీతదర్శకుల్లో దేవీ శ్రీ ప్రసాద్.. థమన్లు ముందుంటారు.

తాజాగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ హీరో రామ్ చేత ఒక పాట ‘హలో గురూ ప్రేమ కోసమే’ పాడించాడట. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే రామ్ తో పాటుగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన గొంతు సవరించుకోవడం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడట. ప్రకాష్ రాజ్ హీరోకు ప్రేమ పాఠాలు.. చిట్కాలు చెబుతాడట. ఇక దేవీ స్వర పరిచిన ట్యూన్ లో ఈ ప్రేమ చిట్కాలు యూత్ కు ఖచ్చితంగా కిక్కెక్కించడం ఖాయం.

రెండు నిముషాలు మాత్రమే ఉండే ఈ పాట రెగ్యులర్ సాంగ్ లా కాకుండా ఒక సంభాషణ టైపులో సాగుతుందట. ఈ పాటను రీసెంట్ గానే దేవీ శ్రీ ప్రసాద్ రికార్డు చేశాడని సమాచారం. ‘జస్ట్ అస్కింగ్’ అంటూ రియల్ లైఫ్ లో కొన్ని రాజకీయ పార్టీలపై విరుచుకుపడే ప్రకాష్ రాజ్ ఈసారి రీల్ లైఫ్ లో ప్రేమ చిట్కాలను జస్ట్ సింగింగ్ అన్న టైపులో చెబుతున్నాడేమో..!
Please Read Disclaimer