ఎడారిలో దారితప్పిన హీరోయిన్

0Pranithaసినిమా పాటలు అంటే హీరోలు హీరోయిన్ డాన్స్ లు తో పాటుగా భారీ సెట్లు అందమైన లొకేషన్లు మనకు గుర్తుకు వస్తాయి. స్టార్ హీరో సినిమా అయితే ఇంకా చెప్పే పనే లేదు. ప్రపంచంలో ఉన్న అందమైన లొకేషన్లు అన్నీ వెతికి మరీ పాటను షూట్ చేస్తూ ఉంటారు. ఇలా మనకు తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలో ఎక్కడైనా ఎలా వెళ్ళాలో తెలియక కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం . ఇక్కడ కూడ మన పక్క ఇండస్ట్రి కన్నడ స్టార్ హీరో పాట కోసం ఖత్తర్ దేశం వెళ్లారు చిత్ర యూనిట్. అక్కడ పాట షూటింగ్లో ఆ సినిమా హీరోయిన్ కి ఒక వింతైన అనుభవం జరిగింది.

మాస్ లీడర్ సినిమాలో దీపావే నిన్నా అనే పాట షూటింగ్ కోసం హీరో శివ రాజ్ కుమార్ అలాగే బాపు బొమ్మ ప్రణీత సుభాష్ పై ఖతార్లో ఉండే అందమైన ఇసుకదిబ్బలు ఎడారి తిన్నెలపై చిత్రీకరణ చేశారు. అరబ్ దేశాలలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈ పాట ద్వారా కనిపిస్తుందట. అయితే అక్కడ ఇసుకదిబ్బ పై వెళ్తున్నప్పుడు వరుసుగా వెళ్ళాలి.. ఎందుకంటే అక్కడ రోడ్ అంటూ ఉండదు అక్కడ వాళ్ళు మాత్రమే అంచనా వేయగలుగుతారు ఎలా వెళ్ళాలి అనేది. షూటింగ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ప్రణీత ఉన్న కారు ఒకసారి దారి తప్పిందిట. ఎలా వెళ్ళాలో దారి తెలియదు కాబట్టి ఈమెకు ఒకటే భయమేసిందట. మొత్తానికి సెల్ నెట్ వర్క్ ఉపయోగించి వీళ్లున్న కారు కనిపెట్టారట. అలా ఆ ఎడారి నుండి సేఫ్ గా అమ్మడు బయటపడింది.

ప్రణీత తెలుగులో సినిమాలు ఏవి లేకపోయాన కన్నడంలో మాత్రం బిజీ గానే ఉంది. దీపావే నిన్నా పాట పాడింది జూబిన్ నౌటియాల్ పాటను కొంపోజ్ చేసింది వీర్ సామ్రాట్. మాస్ లీడర్ సినిమాలో శివ రాజ్ కుమార్ హీరోగా ప్రణీత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగష్టు 11 నాడు ఈ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.