దేవసేన సమేత ప్రణీత!

0టాలీవుడ్లో హీరోయిన్లు చాలామందే ఉన్నారు గానీ బెంగుళూరు బ్యూటీ అనుష్కకున్న ఫాలోయింగే వేరు. స్టార్ హీరోల సినిమాల్లో స్టఫ్ లేని రోల్స్ ఎవరైనా చేస్తారుగానీ ఒక లేడీ ఓరియెంటెడ్ స్టొరీలో నటించేందుకు కావలసిన యాక్టింగ్ స్కిల్స్ – అందం – ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలిగే సత్తా మాత్రం ఒక్క అనుష్కకి మాత్రమే ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈమధ్య ఓ రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఈమధ్య అనుష్క పెద్దగా ఏ ఈవెంట్స్ లోనూ కనబడలేదు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉందని వార్తలు వచ్చాయి గానీ అవి నిజమో కాదో కూడా తెలీదు. రీసెంట్ గా అనుష్క మరో బెంగళూరు బ్యూటీ ప్రణీత ఎయిర్ పోర్ట్ లో కలవడం జరిగిందట.. ఇద్దరు కన్నడ బ్యూటీలు నవ్వుతూ ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్ ను కెమెరాలో బంధించారు.

ఈ ఫోటోలో అనుష్క ఫేస్ లో మాత్రం కాస్త మార్పు ఉంది.. గ్లో పెరిగినట్టుగా కాస్త స్లిమ్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి నిజంగా స్లిమ్మయిందో లేదో మీరే ఒకసారి చూసి చెప్పండి. స్టొరీ అంతా అనుష్క గురించేనా అని ప్రణీత ఫ్యాన్స్ కు కోపం రావచ్చు కాబట్టి ఆమె సంగతి కూడా మాట్లాడుకుందాం. రామ్-త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా కాకుండా ‘లుసిఫెర్’ అనే మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది.