యాత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

0

తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన స్వర్గీయ వై ఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర ఒక మరపురాని ఎపిసోడ్. ఇలాంటి ముఖ్యమైన ఘట్టాన్ని కథాంశంగా తీసుకొని దర్శకుడు మహి వీ. రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మాలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు డీసెంట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ ఏరియాలో 2.2 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. వెస్ట్ గోదావరి రైట్స్ 80 లక్షలు.. నెల్లూరు రైట్స్ 45 లక్షలకు క్లోజ్ అయ్యాయి. ఇక మిగతా ఏరియాలలో యూవీ క్రియేషన్స్ ద్వారా నిర్మాత ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారు. అందుకే మిగతా ఏరియాల రైట్స్ ను రేషియో ప్రకారం లెక్కించడం జరిగింది. ఈ లెక్కన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ షుమారుగా రూ. 13 కోట్ల రూపాయలు.

ప్రపంచవ్యాప్తంగా ‘యాత్ర’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.

నైజామ్: 3.3 cr

సీడెడ్: 2.2 cr

ఆంధ్ర: 5.5 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.40 cr

ఓవర్సీస్: 2.0 cr

టోటల్: రూ.13.40 cr
Please Read Disclaimer