ప్రీతి కూడా సోనమ్ బాటలోనే..

0పెళ్లి తర్వాత జీవితంలో ఏం మార్పు వస్తుందో లేదో తెలియదు కాని అమ్మాయి పేరులో మాత్రం భర్త పేరు కలుస్తూనే యాడ్ అవుతుంది. అది మాములు అమ్మాయిలే కాదు – సెలబ్రిటీలైనా – హీరోయిన్లు అయినా సరే – తండ్రి ఇంటిపేరు ఉంచినా తీసేసినా – భర్త ఇంటి పేరు మాత్రం తగిలించుకోవడం ఆనవాయితీ.

ఇప్పటికే పెళ్లి చేసుకున్న చాలా మంది హీరోయిన్లు భర్త ఇంటిపేరు పెట్టుకున్న వైనం చూస్తూనే ఉన్నాం. కానీ పెళ్లయిన చాలా సంవత్సరాలకి ఒక హీరోయిన్ తన పేరు మార్చుకుంది. ఆమె ఎవరో కాదు ప్రీతి జింటా. పేరు మార్చడం అంటే ఆధార్ కార్డులోనో పాన్ కార్డు లో మాత్రమే కాదు దానికంటే ముందు సోషల్ మీడియా లో మారుస్తున్నారు ఈ మధ్య జనాలు. మొన్నటికి మొన్న పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్ – తన పేరును సోనమ్ కపూర్ నుండి సోనమ్ కె ఆహుజా అని మార్చుకుంది. అలానే ప్రీతి కూడా తన భర్త పేరు జినీ గుడెనఫ్ కాబట్టి అందులోని మొదటి అక్షరం అయిన జి ని తగిలించేసుకుంది.

ఇప్పుడు సోషల్ మీడియా ప్రీతి పేరు ప్రీతి జింటా కాదు ప్రీతి జి జింటా. ఎపుడో 2016 పెళ్లాడిన ఈమె ఇప్పుడు పేరు మార్చుకుంది. ఇప్పుడు భయ్యాజి సూపర్ హిట్ అనే సినిమా షూటింగులో బిజీ గా ఉంది ఈ సొట్ట బుగ్గల సుందరి.