పవన్ చెప్పాడని బ్యారిజాన్ కెళ్లా!

0పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎందరికో స్ఫూర్తి. అతడి స్ఫూర్తితో ఎందరో హీరోలయ్యారు. నటనారంగంలోకి వచ్చారు. పవన్ అభిమానులే హీరోలుగా వస్తున్నారు. పవనిజమ్ పేరుతో సినిమాలే తీస్తున్నారు. అదంతా అటుంచితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన ఓ హింట్ తో శ్రీకృష్ణ దేవరాయల సంస్థానమైన `విజయనగరం` నుంచి అభిలాష్ అనే కుర్రాడు స్ఫూర్తి పొందాడట. హీరో అవ్వాలని ఏకంగా పవన్ ఓ వేదికపై సూచించిన నటశిక్షణాలయంలో చేరి ట్రైనింగ్ అయ్యాడు. అంతేనా.. తొలి ప్రయత్నమే `ప్రేమకు రెయిన్ చెక్` ఆడిషన్స్ లో హీరోగా చాన్స్ కొట్టేశాడు. మొత్తానికి అతడికి ఎర్లీగానే లక్ చిక్కిందన్న చర్చ సాగుతోంది. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు – నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత శరత్ మారార్ సమర్పిస్తున్నారు.

అసలింతకీ ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? అని ప్రశ్నించిన మీడియాకు యువహీరో అభిలాష్ పలు ఆసక్తికర సంగుతులు చెప్పాడు. అభిలాష్ మాట్లాడుతూ-“యూకేలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ చదివాక.. చిన్నప్పటినుంచి ఉన్న ఆసక్తి వల్ల హీరో అవ్వాలనుకున్నా. అనుకున్నదే తడవుగా నటశిక్షణ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేయాలో నాకు అస్సలు తెలీదు. `పిల్లా నువ్వు లేని జీవితం` ఆడియో వేడుకను లైవ్ లో చూస్తున్నప్పుడు హీరో సాయిధరమ్ గురించి పవన్ చెప్పారు. ముంబై బ్యారిజాన్ లో శిక్షణ అద్భుతంగా ఉంటుందని అన్నారు. అది విని వెంటనే ముంబైకి వెళ్లి బ్యారిజాన్ లో చేరిపోయాను. అక్కడ ట్రైనింగ్ అవ్వగానే టాలీవుడ్ ఆడిషన్స్ లో తొలి ప్రయత్నమే `ప్రేమకు రెయిన్ చెక్` చిత్రంలో హీరోగా ఛాన్స్ దక్కింది. ఇది నా అదృష్టం. నార్త్ స్టార్ అధినేత శరత్ మరార్ సమర్పణలో శ్రీనివాస్ గారు దర్శకనిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఆఫీస్ లో ప్రేమాయణం అంటే జాబ్ తో కుదరదని నమ్మే కుర్రాడు ఏ పరిస్థితిలో ప్రేమలో పడ్డాడు? అన్న పాయింట్ తో తెరకెక్కిన సినిమా ప్రేమకు రెయిన్ చెక్. అందరికీ చెక్ చెప్పే అమ్మాయి ప్రేమకు రెయిన్ చెక్ (ఈనెల 7న రిలీజ్) ఎలా చెప్పానో తెరపై చూడండి“ అని తెలిపాడు.

ముంబై బ్యారిజాన్ నటశిక్షణాలయం వరల్డ్ ఫేమస్. ఇక్కడే భళ్లాల దేవ రానా – సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ శిక్షణ పొందారు. బాలీవుడ్ స్టార్లు షారూక్ – వరుణ్ ధావన్ – మనోజ్ భాజ్ పాయ్ వంటి వాళ్లకు శిక్షణ ఇక్కడే. స్టేజీ డ్రామాకు – సినిమా నటులకు బ్యారీ శిక్షణనిచ్చిన గురువు. అతడో గొప్ప టీచర్. మానవతావాది అంటూ షారూక్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాంటి చోట శిక్షణ పొంది వచ్చాడు కాబట్టి – విజయనగరం కుర్రాడు అభిలాష్ ఎలా నటించాడో చూడాలి. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ చేసి సినిమాలవైపు వచ్చినందుకు రిగ్రెట్ ఫీలవుతాడా? లేక హీరోగా ఎదిగేస్తాడా.. ? ఇంతకీ అతడి ఫేట్ ఎలా ఉందో!!