సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్ కం బ్యాక్

0సినిమా హీరోగా ఉన్న గుర్తింపుతో పాటు బిగ్ బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రిన్స్ కొంచెం గ్యాప్ తర్వాత మరో ప్రేమ కథతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అనే కామెడీ థ్రిల్లర్ ని రూపొందించిన దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందిస్తున్న మూవీ కోసం ప్రిన్స్ సిక్స్ ప్యాక్ తో కండలు పెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రిన్స్ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. అన్నట్టు ఇందులో నలుగురు హీరోయిన్లు ఉంటారట. వాళ్ళు ఎవరూ అనే క్లారిటీ ఇంకా లేదు కానీ మరో ట్విస్ట్ ఏంటంటే ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇందులో కీలక పాత్ర వహించనుండటం. తను ఎవరు అనేది సీక్రెట్ గా ఉంచి తర్వాత రివీల్ చేస్తారట. లఢక్-గోవా-హైదరాబాద్-వారణాసి లాంటి డిఫరెంట్ లొకేషన్స్ లో దీని షూటింగ్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. సోరింగ్ ఎలిఫెంట్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నాడు. దిలీప్ కుమార్ – పద్మాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

బస్ స్టాప్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న ప్రిన్స్ ఇప్పుడు ఈ సినిమా కోసం చేసుకున్న మేకోవర్ తో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. బిగ్ బాస్ తో వచ్చిన పేరుని నిలబెట్టుకోవడంతో పాటు హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కష్టపడి బాడీ మేకోవర్ చేసుకున్నానని చెబుతున్న ప్రిన్స్ దీని విజయం మీద చాలా ధీమాగా ఉన్నాడు. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టుకోబోతున్న దీని ఫోటో షూట్ పిక్స్ చూస్తే ఏదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీగా కనిపిస్తోంది. మరి ప్రిన్స్ ఆశలు దీనితో ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.