బిగ్‌బాస్ హౌస్‌లో ఆ ఇద్దరి తొలి ముద్దు

0తెలుగు తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్1 సక్సెఫుల్‌గా 18వ ఎపిసోడ్‌‌లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే… బిగ్‌బాస్ హౌస్‌లో లగ్జరీ బడ్జెట్ కోసం రసవత్తరంగా సాగుతున్న ‘ఒప్పో పైసా వసూల్’ టాస్క్‌లో వసూలుదారులపై వినియోగదారులు గెలిపొందారు. దీంతో విన్నర్ గ్రూప్‌ సభ్యులుగా ఉన్న ధనరాజ్, ముమైత్ ఖాన్ లగేజ్‌ను తిరిగి ఇచ్చేశారు బిగ్ బాస్. అంతేకాకుండా ఈ టాస్క్‌లో అందరి హౌస్ పెర్ఫామెన్స్ చాలా బాగుందని.. అందుకు గానూ లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా 1400 వందల పాయింట్‌లను ఇచ్చారు. ఆ బడ్జెట్‌తో కొన్ని వస్తువులను కొనిక్కోవచ్చని కొన్ని కండిషన్‌లను పెట్టారు బిగ్ బాస్. ఆ వచ్చిన పాయింట్స్‌తో పెరుగు,చికెన్, ఐస్‌క్రీమ్, బాదం, చిల్లీసాస్ లను వినియోగదారులు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కొనుక్కున్నారు.

ఇక వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌ షో గ్లామర్ లుక్‌ ఇచ్చిన దీక్షపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రిన్స్. ఒకవైపు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా దీక్షకు తగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. లగ్జరీ బడ్జెట్‌లో గెలుపొందిన వినియోగదారుల గ్రూపులోనే ఇద్దరూ ఉండటంతో ఆ అమౌంట్‌ని పంచుకునే నేపధ్యంలో దీక్షకు తక్కువ అమౌంట్‌ని కేటాయించడం ఆమె తిరిగి అడగడంతో సారీ అని చెప్పుతూనే.. దీక్షను ముద్దాడేశాడు ప్రిన్స్. ఏం చేస్తున్నావ్ ప్రిన్స్ అని షాక్ తిన్న దీక్ష అడగడంతో పక్కనే కదా ముద్దు పెడతా అంటూ కామెడీగా కవర్ చేసేశాడు ప్రిన్స్. మొత్తానికి ప్రిన్స్ ‘దీక్ష’ పట్టుదలతోటే గేమ్ ఆడుతున్నట్టు ఈ ఫస్ట్ కిస్‌ని బట్టి అర్థమౌతూనే ఉంది.

మరోవైపు దీక్ష పనిసరిగా చేయడంలేదని అర్చన, ముమౌత్, హరితేజలు కంప్లైంట్ చేయడంతో ప్రిన్స దీక్షను నేను చెప్తా తనకి అంటూ.. నువ్ పనిలో ముమైత్‌కి సాయంచేయమని పని రాకపోతే నేర్చుకుని చేయాలని అందరూ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారని ప్రిన్స్ దీక్షను అడగగా.. నేను పనిచేస్తున్నానని నేను అందర్నీ అర్థం చేసుకున్నా నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదని ఇక్కడ చాలా రాజకీయాలు చేస్తున్నారంటూ దీక్ష కన్నీరుపెట్టుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ఏడుస్తుండటం ఉన్న టీజర్‌ను వదిలడంతో.. ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా.. లేక ఎవరికైనా ఏమైనా అయ్యిందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ సస్పెన్స్‌కు తెరదించాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.