వివాదంగా మారిన రాష్ట్రపతి నిర్ణయం

0భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరగనున్నాయి. విజేతలందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమానికి కోవింద్ కేవలం గంట సమయం మాత్రమే ఇచ్చారు. కేటాయించిన సమయంలో ఆయన కేవలం 11 మందికి మాత్రమే అవార్డులను అందిస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

1954లో జాతీయ అవార్డులు ప్రవేశపెట్టిన తర్వాత జాతీయ అవార్డులు గెలుచుకున్నవారందరికీ రాష్ట్రపతే అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 64 ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయంలో ఇప్పుడు మార్పులు చేయడంతో పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.