ప్రియా వర్సెస్ రాహుల్…వింక్ కాంటెస్ట్!

0నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెచ్చిపోయి వీరావేశంతో ప్రసంగించడం ఒక ఎత్తయితే….ఆ తర్వాత నేరుగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను హగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ ఘటనతో సభా ప్రాంగణమంతా నవ్వులు పూస్తున్న సమయంలోనే…రాహుల్ కొంటెగా కన్నుగీటడం…ఈ మొత్తం ఎపిసోడ్ కు కొసమెరుపు. తన తోటి సభ్యులడిగిన దానికి తల ఊపిన రాహుల్….కన్ను కొడుతూ చిరు మందహాసంతో కనిపించారు. దీంతో రాహుల్ హగ్ అండ్ వింక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీని ….వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ తో పోలుస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ రోజు పార్లమెంటులో రాహుల్…తన ప్రసంగంతో పాటు హావభావాలతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. మోదీని హగ్ చేసుకొని రాహుల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే….పక్కన ఎవరికో రాహుల్ కన్నుకొడుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో రాహుల్ ను వింక్ సెన్సేషన్ – మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ తో నెటిజన్లు పోలుస్తున్నారు. కన్నుగీటడంలో రాహుల్ కు ప్రియా ప్రకాష్ వారియర్ కు పోలిక పెడుతూ కామెంట్స్ పెడుతున్నారు. వారిద్దరిలో ఎవరు బాగా కన్నుగీటారంటూ జోక్ లు పేలుస్తున్నారు. ప్రియా – రాహుల్ ల వింక్ వీడియోలను మిక్స్ చేసిన మరో వీడియో….సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా రాహుల్ గాంధీ కన్నుగీటిన వార్తపై ప్రియా ప్రకాష్ వారియర్ స్పందించింది. తనను పాపులర్ చేసిన `వింక్`ను రాహుల్ ఇమిటేట్ చేయడం సంతోషాన్నిచ్చిందని ప్రియా ట్వీట్ చేసింది.