ప్రియదర్శన్ కి పెళ్లి కల

0priyadarshin-marriageఎంతో కష్టపడితే గాని సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రాదు అనే మాట కొన్నేళ్ల క్రితం బాగా వినిపించేది. కానీ ఈ రోజుల్లో కరెక్ట్ గా ఒక్క క్యారెక్టర్ తో క్లిక్ అయితే చాలు. స్టార్ హీరోల రేంజ్ లో స్టార్ డమ్ వచ్చేస్తుంది. అలాగే ఆ స్టార్ హోదాను కాపాడుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ సినిమాతో బంపర్ ఆఫర్లు అందుకుంటున్న కమెడియన్స్ సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు.

అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకరు. కమెడియన్ గా తనదైన లాంగ్వేజ్ తో ఆకట్టుకునే ప్రియదర్శి పెళ్లి చూపులు సినిమాతో ఎంతగా ఫెమస్ అయ్యాడో అందరికి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. రీసెంట్ గా మనోడికి పెళ్లి చూపులు అయ్యాయట. అంతే కాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. వచ్చే నెల 23న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వెడ్డింగ్ హాల్ లో ప్రియదర్శి రిచా శర్మ అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

పెళ్లి చూపులు సినిమా తరువాత ప్రియదర్శి చాలా బిజీ అయ్యాడు. అసలైతే గత కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదట. గత ఏడాది ప్రియదర్శి ఫుల్ బిజీ అయ్యాడు. 2017లో దాదాపు 14 సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా మహేష్ బాబు స్పైడర్ సినిమాలో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా ప్రియదర్శి కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.