బెల్లి లలిత పాత్రలో ఆ హీరోయిన్

0

రానా దగ్గుబాటి.. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించే పీరియడ్ ఫిలిం ‘విరాటపర్వం 1992’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 90 ల నేపథ్యంలో నక్సల్ సమస్య.. మానవ హక్కులు ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కనుండడం ఆ ఆసక్తికి కారణం. రానా.. సాయి పల్లవి తో పాటుగా సీనియర్ నటి.. నేషనల్ అవార్డు విన్నర్ టబు కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక వీరితో పాటుగా మరో టాలెంటెడ్ హీరోయిన్.. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఈ సినిమాలో నటిస్తోందని సమాచారం.

సౌత్ లోని అన్ని భాషలలో హీరోయిన్ గా నటించిన ప్రియమణి తెలుగులో ఎన్టీఆర్.. నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అంతే కాదు.. ‘పడుతివీరన్’ సినిమాకు ప్రియమణి ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రియమణి ‘విరాటపర్వం 1992’ లో ఒక రియల్ లైఫ్ బేస్డ్ పాత్రలో నటిస్తోందట. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నక్సల్ ఉద్యమం తీవ్రంగా ఉండే సమయంలో తెలంగాణా ప్రాంతంలో బెల్లి లలిత అని ఫోక్ సింగర్ ఉండేది. 19 ఏళ్ళ వయసులోనే విప్లవగాయనిగా మారింది.

ఆమెను గ్యాంగ్ స్టర్ నయీం చిత్రహింసలు పెట్టి మరీ చంపాడు. తర్వాత ఆమె బాడీని పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. ఇప్పుడు ‘విరాటపర్వం 1992’ లో ఈ బెల్లి లలిత జీవితం ఆధారంగా ఒక పాత్రను డిజైన్ చేశారట. ప్రియమణి మంచి నటి కాబట్టి ఈ పాత్రలో ఒదిగిపోవడం ఖాయం. టాలీవుడ్ లో ఈమధ్య ప్రియమణికి అసలు ఆఫర్లు లేవు. మరి ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer