ప్రేమపక్షులు చేయి చేయి కలిపి

0ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం! అని సాంగేసుకోవాల్సిన పనే లేకుండా ఈ ఇంగ్లీష్ పోరడు ఆవేశపడుతున్న తీరు చూస్తుంటే ప్రేమ పెళ్లి ఇంత సులువా? అనిపిస్తోంది. పీసీతో ప్రేమలో పడింది మొదలు అసలు నిక్ జోనాస్ కి కంటిమీద కునుకే కరువైంది. ఒక ఇండియన్ గాళ్ కం నటిని పెళ్లాడాలన్న తపన అతడిలో అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు ఇండియా వచ్చి వెళ్లాడు. రెండోసారి ఏకంగా తల్లిదండ్రులతో ముంబైలో దిగిపోయాడు.

అలా వస్తున్న ఆ ఫోటోలు అంతర్జాలాన్ని హోరెత్తించాయి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా! రాసుకున్న బాసలు .. మనసులోని ఊసులు!! అంటూ ఆ ఇద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యి వేసుకుని వస్తున్న తీరు చూపరులను స్పెల్ బౌండ్ చేసేసింది. అన్నట్టు అత్త మామలు నిన్ననే అదిరిపోయే టిఫానీ & కో బ్రాండ్ గిఫ్ట్ బ్యాగులతో దిగిపోయారు. అంతకుముందే నిక్ జోనాస్ కోటి ఖరీదైన టిఫానీ బ్రాండ్ వజ్రాల రింగ్ని పీసీకి కానుకగా ఇచ్చాడు. అసలు ముంబైలో అడుగుపెట్టింది మొదలు ప్రియుడు నిక్ని అతడి తల్లిదండ్రుల్ని అసలు ప్రియాంక చోప్రా విడిచిపెట్టనే లేదుట.

ఇన్నాళ్లు బాలీవుడ్ మీడియా ఆ జంటను నిదురపోనివ్వకుండా చేసింది. నిశ్చితార్థం అయిపోయిందోచ్! అంటూ పీసీ వేలికి ఉన్న ఉంగరంపైనే ఫోకస్ పెట్టింది. అయితే అది అసలు నిశ్చితార్థం కాదు. ముందుంది అసలు సిసలు నిశ్చితార్థం పండుగ. ఇప్పుడు జగరబోయేది అధికారిక యంగేజ్ మెంట్ అని చెబుతున్నారు. ఆ తర్వాత జరిగే రోకా పార్టీకి ప్లాన్ చేశారట. పనిలోపనిగా నిన్నటిరోజున డిన్నర్ డేట్ కి వెళ్లింది ఈ జంట. కుటుంబ సమేతంగా ముంబైలోని ఓ ఖరీదైన ఐదు నక్షత్రాల హోటల్లో డిన్నర్ చేసి వచ్చారట. ఇక నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.