కేన్స్ లో ప్రియానిక్ రొమాంటిక్ లుక్

0

కేన్స్ 2019 సంబరాలు గత నాలుగు రోజులుగా ఫ్రెంచి రివెరాలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెడ్ కార్పెట్ నడకలతో వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీపిక.. ప్రియాంక చోప్రా.. కంగన.. హీనా ఖాన్ లాంటి నాయికలు ఇప్పటికే తమవైన అందచందాలు.. స్టైలిష్ డిజైనర్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ గ్యాంగ్ కి ఠఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కేన్స్ వేడుకలకు ఎటెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

కేన్స్ లో ఉతికి ఆరేస్తున్న అందగత్తెల జాబితాని తిరగేస్తే ఇందులో మ్యారీడ్ గాళ్స్ దే హవా అని అర్థమవుతోంది. ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే పెళ్లి తర్వాత ఇస్తున్న ట్రీట్ ఇది. ఆ ఇద్దరూ రకరకాల డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించారు. ఇకపోతే ప్రియాంక చోప్రా లేటెస్టుగా హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి చోపార్డ్ పార్టీకి ఎటెండైంది. అక్కడ రెడ్ కార్పెట్ పై హొయలు పోయిన తీరు ప్రముఖంగా చర్చకు వచ్చింది. పీసీ- నిక్ జోడీ కొత్త జంటలకు సరికొత్త గోల్స్ ని ఫిక్స్ చేశారంటూ ప్రశంసలు దక్కాయి.

పీసీ ధరించిన డిజైనర్ వేర్ పైనా యూత్ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఈ భామ సిల్వర్ కలర్ మెర్మెయిడ్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. మిరుమిట్లు గొలిపే షైనింగ్ లుక్ తో పీసీ అదరగొడితే.. హబ్బీ నిక్ జోనాస్ బ్లాక్ టక్సెడో సూట్ లో మ్యాచింగ్ బోయ్ లా కనిపించాడు. పార్టీలో ఈ జంట యూనిక్ స్టైల్లో కనిపించింది.

పీసీ ఇప్పటికే డిఫరెంట్ గెటప్పుల్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకూ రోజ్ గోల్డ్ డిజైనర్ డ్రెస్ లో కేన్స్ వేడుకల్ని రంగుల మయం చేసింది. పింక్ లిప్స్ రోజ్ పింక్ లుక్ తో మతి చెడగొట్టింది. పీసీ ప్రస్తుతం స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఇకపోతే కేన్స్ లో ఇప్పటివరకూ దీపిక పదుకొనే తన హబ్బీ రణవీర్ సింగ్ తో కలిసి జోడీగా కనిపించలేదు. ఆ సన్నివేశం మునుముందు ఉంటుందేమో. ఈలోగానే ఐష్ – ఆరాధ్యతో కలిసి కేన్స్ రెడ్ కార్పెట్ పై వెలుగులు పరిచేందుకు సిద్ధమవుతోంది.
Please Read Disclaimer