హాలీవుడ్ కే దిమ్మతిరిగే క్లీవేజ్ షో

0

ఫలానా హాలీవుడ్ కథానాయిక అందాల ఆరబోతతో హీటెక్కించిందని మాట్లాడుకునేవారు. జనరేషన్ గ్యాప్ తో నేటితరం స్టార్లు గ్లామర్ ఎలివేషన్ కి ఎలాంటి అభ్యంతరం చెప్పకవడంతో పాశ్చాత్య స్టార్లకు మన స్టార్లకు మధ్య సరిహద్దు చాలా వరకూ చెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుత బాలీవుడ్ ని ఆల్మోస్ట్ హాలీవుడ్ తో సమానంగా చూస్తున్నారు యూత్. అక్కడ హద్దే లేకుండా చెలరేగిపోయే అందాల కథానాయికలకు కొదవేం లేదు. మడోన్నా .. జెన్నిఫర్.. లేడీ గాగా.. యాంజెలీనాకే చెమటలు పట్టించేంత గ్లామర్ ఎలివేషన్ .. క్లీవేజ్ షోలు నిరంతరం చూస్తున్నదే. ఇటీవల పలువురు బాలీవుడ్ కథానాయికలు హాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. దీంతో పాశ్చాత్య సినిమాల ధోరణి వ్యక్తిగతంగానూ ఇంపోర్ట్ చేసేయడం చర్చకు వచ్చింది.

ఇకపోతే మాజీ మిస్ యూనివర్శ్ ప్రియాంక చోప్రా అమెరికా బోయ్ ఫ్రెండ్ నిక్ ని పెళ్లాడిన దగ్గర నుంచి ఏ తీరుగా మారిపోయిందో చూస్తున్నదే. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్న సూత్రాన్ని పీసీ పాటిస్తోంది. హాలీవుడ్ లో అమెరికా కోడలుగా ఈ అమ్మడు హద్దే లేకుండా చెలరేగిపోవడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. భారతీయతను పూర్తిగా మర్చిపోయి పీసీ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇక వెస్ట్రన్ స్టైల్ మోడ్రన్ డిజైనర్ డ్రెస్సుల్లో నిరంతరం కనిపిస్తూ అందాల్ని ఎలివేట్ చేస్తున్న తీరుపై నెటిజనుల్లో ట్రోలింగ్ తప్పడం లేదు. అయినా పీసీ తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. అమెరికా టీవీ చానెళ్లలో లైవ్ షోల్లోనే వేడెక్కించిన ఈ అమ్మడు ఏకంగా ఇప్పుడు ఏదైనా అవార్డుల కార్యక్రమానికి వెళితే ఆగుతుందా?

ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ -2019 కార్యక్రమంలో పీసీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాసినోవా సిటీ లాస్ వేగాస్ లో జరుగుతున్న ఈ వేడుకల్లో భర్త నిక్ జోనాస్ తో కలిసి ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీ అంతర్జాతీయ మీడియా లైవ్ లోనే హబ్బీకి అదిరిపోయే కిస్సిచ్చింది. ముఖ్య ంగా ఈ వేడుక ఆద్య ంతం పీసీ క్లీవేజ్ షో కన్నుల పండుగ గా నిలిచింది. యూత్ ని కళ్లు తిప్పుకోనివ్వని రేంజులో పీసీ అందాలు ఆరబోసింది. అయితే ఈ తరహా ఇదే తొలిసారి కాదు. తాను ఏ స్పెషల్ కార్యక్రమానికి వెళ్లినా మినిమంగా ఈ రేంజులోనే డెకరేట్ అయ్యి వెళుతోంది. క్లీవేజ్ షోలో హాలీవుడ్ స్టార్లకే చెమటలు పట్టించేస్తోంది. అయితే పీసీ మరీ ఇంతగా రెచ్చిపోతుండడంతో ఇండియా ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగానే హర్టవుతున్నారు. ఈ అమ్మడు మరీ బరితెగిస్తోందన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా కోడలా మజాకానా? ఆమాత్రం లేకపోతే ఎలా అనేవారూ లేకపోలేదు!
Please Read Disclaimer