పెళ్లి కూతురు ఎర్ర సింధూరం

0

వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా..
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా..
చెడిపోవద్దు బ్రహ్మచారి.. పడిపోవద్దు కాలు జారి..
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి కల్యాణమే ఖైదురా.
ఒరేయ్ వద్దురా సోదరా .. వద్దురా!!!!

మన్మథుడు (2003) చిత్రంలోనిది ఈ పాట. సిరివెన్నెల సాహిత్యం దేవీశ్రీ సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానంతో ఈ పాట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి పేరుతో సంబరాలు చేసుకుంటున్న నిక్ని చూడగానే ఆ పాట గుర్తుకు రావాల్సిందే ఏ బ్యాచిలర్కి అయినా. పెళ్లంటే నూరేళ్ల పంట .. అంటూ పీసీని మనువాడేసిన నిక్ జోనాస్ .. ఈవేడుకను ఎంతగా ఎంజాయ్ చేశాడో ఇవిగో ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతోంది. ఈ పెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే ఆలుమగలు ఒకరినొకరు అంతే అర్థం చేసుకుని దాంపత్యం సాగించాల్సి ఉంటుంది. అయితే పీసీ అప్పుడే నిక్ని కొంగున కట్టేసుకోవడం ఈ ఫోటోల సాక్షిగా బయటపడుతోంది. అతడితో నవ్వుతూ తుళ్లుతూనే మూడు ముళ్లు వేయించుకుంది. కొంగు చుట్టూ బొంగరంలా తిప్పేసుకుంటూ కుర్రాడిని కట్టేసుకుంది.

దీపిక- రణవీర్ పెళ్లి ఫోటోలు ఓవైపు జోరుగా వైరల్ అవుతుంటే మరో వైపు పీసీ- నిక్ పెళ్లి ఫోటోలు వెబ్ని ఠారెత్తిస్తున్నాయి. ఘడియ ఘడియకో మూవ్మెంట్! అన్న చందంగా ఇప్పటికే తామరతంపరగా బోలెడన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వాటిలో కొన్ని కలర్ఫుల్గా రంజింపజేస్తున్నాయి. ముఖ్యంగా పీసీ ఎర్రని సింధూరం రంగు పెళ్లి దుస్తుల్లో తళతళలాడింది. పెళ్లికొడుకు నిక్ జోనాస్ ట్రెడిషనల్ రాజస్థానీ లుక్లో మైమరిపించాడు.
Please Read Disclaimer