తెల్ల కుర్రాడితో ఎర్ర మందారం

0ఇన్నాళ్లుగా రూమర్ గా ఉన్నది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందని.. రేపో మాపో అతడిని పెళ్లి చేసుకోబోతోందనే టాక్ కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఈమధ్యనే ఈ జంట కలిసి ఇండియాకి వచ్చింది. ముంబయిలో రెండురోజులుండి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది.

తాజాగా నిక్ జోనాస్ – ప్రియాంక చోప్రా జంట ముంబయిలో మెరిసింది. ఈసారి మామూలుగా కాదు.. చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ మరీ కనిపించారు. ఇండియాలోని టాప్ మోస్ట్ ఇంటస్ట్రియలిస్ట్ అయిన ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ ఎంగేజ్ మెంట్ జూన్ 30న జరగనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్లందరికీ ముఖేష్ అంబానీ పెద్ద పార్టీ ఇచ్చాడు. దీనికే ప్రియాంక – నిక్ జోనాస్ జంటగా వచ్చి కపుల్ ఎంట్రీలోంచి పార్టీకి కలిసి వెళ్లారు. నిక్ మామూలుగా సూట్ లో వస్తే ప్రియాంక ఎర్రటి శారీ – గోల్డ్ కలర్ బ్లవుజ్ తో మెరుపులు మెరిపించింది.

బాలీవుడ్ బోలెడు పాపులారిటీ సంపాదించేసిన ప్రియాంక చోప్రా బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. దీంతో పాటు క్వాంటికో టీవీ సిరీస్ లోనూ నటించింది. ఇందుకోసం చాలారోజుల పాటు అమెరికాలోనే ఉంది. ఈ టైంలోనే ఈ అందాల భామకు నిక్ జోనాస్ పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. మొత్తానికి ప్రియాంక తన మనసులోని మాటేంటో నోరువిప్పి చెప్పకుండానే చెప్పేసింది.